ఈ రోజు ఆర్టికల్ లో స్టూడెంట్స్ బ్లాగింగ్ ఎందుకు చెయ్యాలో తెలుసుకోవచ్చు.
ఈ రోజుల్లో ఆంధ్ర లోనే కాదు ఇండియా ప్రకారంగా కూడా బ్లాగింగ్ ఒక మంచి కెరీర్ ఆప్షన్. చాలా మంది బ్లాగింగ్ ని ఒక కెరీర్ గా ఎంచుకుంటున్నారు. అయితే స్టూడెంట్ గా ఉన్నప్పుడే బ్లాగింగ్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా advantages ఉంటాయి. అవి ఏమిటో మనం ఈ రోజు డిస్కస్ చేసుకోవచ్చు.
చాలా మంది నిపుణులు మొదట బ్లాగింగ్ ను సైడ్ బిజినెస్ గా స్టార్ట్ చేయాలి అంటారు. ఒకసారి మనీ ఫ్లో ఉన్న తర్వాత ఫుల్ టైమ్ గా తీసుకోవచ్చు.
బ్లాగింగ్ ద్వారా మనీ రావడానికి టైమ్ పడుతుంది. సుమారుగా 6 నెలలు నుండి ఒక సంవత్సరం వరకు పడుతుంది. ఈ టైమ్ మనం ఎంచుకున్న టాపిక్ మరియు మనం పెట్టె ఎఫర్ట్స్ మీద depend అయి ఉంటుంది. ఏది ఏమయినా బ్లాగింగ్ ద్వారా ప్రతి నెల reasonable అమౌంట్ రావడానికి సమయం పడుతుంది.
కాబట్టి స్టూడెంట్ గా ఉన్నప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేస్తే మనం ఎక్కువ టైమ్ బ్లాగింగ్ కి పెట్టవచ్చు. ఆ టైమ్ లో ఒక వైపు ఎడ్యుకేషన్ చేస్తాం కాబట్టి మనీ త్వరగా రాకపోయినా పరవాలేదు. అదే విధంగా బ్లాగ్ ఒక వేల ఫెయిల్ అయిన మనం ఎటువంటి worry అవనవసరం లేదు.
స్టూడెంట్ గా ఉన్నపుడే బ్లాగింగ్ చేయడం ద్వారా మనకి కొంత మనీ రావడం తో మన పేరెంట్స్ మీద మనీ కోసం అంత ఎక్కువగా depend అవనవసరం లేదు. అలాగే మనలో confident లెవెల్స్ పెరుగుతాయి.
మీ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యేసరికి మీకోక ఆన్లైన్ asset ready అవుతుంది. మీరు కావాలి అనుకుంటే అదే బ్లాగ్ ని కెరీర్ గా తీసుకొని మీరు ముందుకు వెళ్ళవచ్చు. లేదా మీరు ఆ బ్లాగ్ ని కొంత అమౌంట్ కి కూడా sale చేయవచ్చు.
మీరు జాబ్ వస్తుందా రాదా అని ఎక్కువగా worry అవ్వనవసరం లేదు ఎందుకంటే ఒకవేల జాబ్ రాకపోతే మీ బ్లాగింగ్ నే కెరీర్ గా మార్చుకోవచ్చు.
మీరు ఇంటర్వ్యూ లో వేరే వాళ్ళతో పోలిస్తే మీరు కొంచెం విభిన్నంగా stand out అవ్వవచ్చు. దీని వాళ్ళ మీరు జాబ్ కి సెలక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీరు Internship చేయడానికి మీకు మంచి అవకాశాలు వస్తాయి.
మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ బ్లాగింగ్ నే ఒక కంపెనీ రూపంలో మార్చి ఇతరులకు జాబ్ ఇచ్చి entrepreneur గా ఎదగవచ్చు .
స్టూడెంట్స్ బ్లాగింగ్ చేయడం ద్వారా యిన్ని రకాలుగా advantage పొందవచ్చు.
మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయుటకు కావలసిన investment min Rs 5000 .
మీరు ఒక డొమైన్ మరియు వెబ్ హోస్టింగ్ కొనవలెను.
వెబ్ హోస్టింగ్ మీరు బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ అయిన Bluehost నుండి తీసుకోవచ్చును.
మరెన్నో విషయాలు upcoming ఆర్టికల్స్ లలో తెలుసుకోవచ్చు.
ధన్యవాదములు.