ఈ రోజు ఆర్టికల్ లో మనం వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.
మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ప్రధమంగా కావలసినవి డొమైన్ నేమ్ మరియు వెబ్ హోస్టింగ్.
ముందు ఆర్టికల్ లో మనం డొమైన్ నేమ్ కోసం డిస్కస్ చేసుకున్నాము. ఈ ఆర్టికల్ లో వెబ్ హోస్టింగ్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మన వెబ్సైట్ files ని ఇంటర్నెట్ లో పెట్టుటకు కావలసిన మెమరీ స్పేస్ ని వెబ్ హోస్టింగ్ అంటారు. దీని కోసం సర్వర్ ను ఏర్పాటు చేస్తారు.
మనం రిజిస్టర్ చేసిన డొమైన్ నేమ్ ని ఈ వెబ్ హోస్టింగ్ తో లింకు చేస్తాము.
మనం మన బ్రౌజర్ లో డొమైన్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు ఆ డొమైన్ నేమ్ తో మ్యాప్ అయిన హోస్టింగ్ కి కనెక్ట్ ఆయీ అక్కడ మెమరీ స్పేస్ లో ఉన్న మన వెబ్సైట్ ఇక్కడ మన బ్రౌజర్ లో లోడ్ అవుతుంది.
మనంతట మనం ఒక సర్వర్ ను పెట్టుకొనుటకు మనకు ఎక్కువ అమౌంట్ అవుతుంది. అలాగే ఈ సర్వర్ ను manage చేయాలి అంటే ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉండవలెను.
ఇందువల్ల మనం హోస్టింగ్ కంపెనీ లు అయిన Bluehost లాంటి హోస్టింగ్ కంపెనీ ల నుండి మనకి సరిపడ హోస్టింగ్ స్పేస్ ని పర్చేస్ చేసి దానితో మన డొమైన్ నేమ్ లింకు చేసి మన వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటాము.
మనకి హోస్టింగ్ లో డిఫరెంట్ హోస్టింగ్ లు ఉంటాయి. shared hosting, wordpress hosting, managed hosting, vps hosting, dedicated hosting.
వీటి గురించి వచ్చే ఆర్టికల్ లలో తెలుసుకోవచ్చు.
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే నాకు మెయిల్ చేయవచ్చు.
ధన్యవాదములు.