What is Google Search Console Telugu

హలో , ఈ రోజు ఆర్టికల్ లో మనం Google Search Console గురించి తెలుసుకుందాం. 

ఇది గూగుల్ యొక్క ప్రోడక్ట్. 

మనం ఒక వెబ్సైటు స్టార్ట్ చేసిన లేదా బ్లాగ్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ ఉపయోగించవలసిన టూల్ ఏమిటి అంటే Google Search Console. 

మనం వెబ్సైటు స్టార్ట్ చేస్తే సరిపోదు దానికి జనాలు వచ్చినప్పుడే మనకి వెబ్సైటు ద్వారా ప్రాఫిట్ వస్తుంది. 

మన వెబ్సైటుకి ట్రాఫిక్  తీసుకురావడానికి సెర్చ్ ఇంజిన్స్ అన్నవి గొప్ప మార్గం. 

గూగుల్ అన్నది అతి పెద్ద సెర్చ్ ఇంజిన్. 

అయితే ఈ గూగుల్ నుండి ట్రాఫిక్ రావాలి అంటే ఫస్ట్ మన వెబ్సైటు ఈ గూగుల్ లో ఇండెక్స్ అవ్వాలి. 

గూగుల్ లో మన వెబ్సైటు ఇండెక్స్ అవ్వాలి అంటే మనం మన వెబ్సైటు ని google search console టూల్ కి సబ్మిట్ చేయవలెను. 

మన బ్లాగ్ లేదా వెబ్సైటు Sitemap ను ఈ టూల్ లో సబ్మిట్ చేస్తాము. 

ఒకసారి మన వెబ్సైటు sitemap ఈ టూల్ లో సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ మన వెబ్సైటు ని ఎప్పటికప్పుడు క్రాల్ చేసి ఆర్టికల్స్ లేదా వెబ్ పేజీలను ఇండెక్స్ చేస్తుంది. 

అలాగే మనం ఎప్పటికప్పుడు మన వెబ్సైటు ఏయే కీవర్డ్ లకు ఏయే position లో ర్యాంక్ అవుతున్నాయో మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 

ఒకసారి మన ఆర్టికల్ గూగుల్ లో ఇండెక్స్ అయిన తర్వాత ఈ ఆర్టికల్ ఏయే కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నాయో ఈ టూల్ లో చూసి దానికి తగట్టుగా మన ఆర్టికల్ ను ఆప్టిమైజ్ చేయవచ్చు. అప్పుడు మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది. 

అదే విధంగా ఈ టూల్ ఎప్పటికప్పుడు ఇండెక్సింగ్ issues ఏమయినా ఉంటే ఈ టూల్ మనకి అలెర్ట్ ఇస్తుంది. 

ఈ టూల్ లో మన వెబ్సైటు ఓనెర్షిప్ వెరిఫై చేయుటకు ఈ టూల్ provide చేసే ఫైల్ ని మన వెబ్సైటు రూట్ ఫోల్డర్ లో అప్లోడ్ చేయవలెను. 

మీరు మీ వెబ్సైటు ద్వారా లేదా బ్లాగ్ ద్వారా మంచి ట్రాఫిక్ తెచ్చుకోవాలి అంటే మీరు ఈ టూల్ గురించి  తెలుసుకోవాలి. 

మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. 

 ధన్యవాదములు.