ఈ రోజు ఆర్టికల్ లో మనం Google Analytics అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.
Google Analytics అనునది గూగుల్ ఇస్తున్న వెబ్సైటు లకు డేటా అనలిటిక్స్ టూల్.
ఈ టూల్ ద్వారా మనం మన వెబ్సైటు కి వచ్చే విజిటర్స్ ఎనాలిసిస్ చేయవచ్చు.
వీరు మనకి ఒక java script కోడ్ ఇస్తారు. దీనిని మనం హెడర్ లో ఇన్సర్ట్ చేయవలెను.
ఎప్పుడయితే ఈ కోడ్ మనం హెడర్ లో పెట్టామో అప్పుడు మన వెబ్సైటు లో ప్రతి పేజీ లో ఈ కోడ్ ఇన్స్టాల్ అవుతుంది.
దీని ద్వారా మనం మన వెబ్సైటు కి ఎంత మంది visitors వచ్చారో తెలుసుకోవచ్చు.
వచ్చిన యూజర్స్ ఏ లొకేషన్ నుండి వచ్చారో కూడా తెలుసుకోవచ్చు.
వచ్చిన యూజర్లు మన యొక్క వెబ్సైటు లో ఎంత సేపు ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు.
ఒక బ్లాగర్ లేదా వెబ్ మాస్టర్ కచ్చితంగా ఉపయోగించవలసిన టూల్ ఇది.
మీరు ఒక వెబ్సైటు లేదా బ్లాగ్ రన్ చేస్తే అప్పుడు మీరు ఈ టూల్ ను ఉపయోగించవలెను.
ఇందులో వచ్చే డేటా ఆధారంగా మనం డేటా driven డెసిషన్స్ తీసుకోవచ్చు.
ఇందులో వచ్చే డేటా ని మనం వివిధ రకములుగా ఫిల్టర్ చేసుకోవచ్చు.
మనం ఇందులో లాస్ట్ 30 డేస్ , లాస్ట్ 7 డేస్, లాస్ట్ వన్ ఇయర్ ఈ విధంగా డేటా ని ఫిల్టర్ చేసి మనం ఈ డేటా ను స్టడీ చేయవచ్చు.
మనం కస్టమ్ డేట్ రేంజ్ పెట్టుకొని కూడా డేటా స్టడీ చేయవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీరు మీ గూగుల్ అనలిటిక్స్ ని మీ వెబ్సైటు లేదా మీ బ్లాగ్ లో ఇన్స్టాల్ చేసేయండి.
మీరు వర్డుప్రెస్సు వాడుతున్నట్లయితే మీరు ఈ కోడ్ ని WPCode అనే ప్లగిన్ ద్వారా ఈజీ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్ లో ఏదయినా టెక్నికల్ హెల్ప్ కావలి అంటే ఇప్పుడే మాకు మెసేజ్ చేయండి.
ధన్యవాదములు.