What is Elementor in WordPress Telugu

wordpress

హలో ఫ్రెండ్స్, మనం Elementor అంటే ఏమిటో తెలుసుకుందాం.

అసలు Elementor ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

Elementor అంటే ఏమిటి?

ఎలిమెంటర్ అనేది WordPress ప్లగ్ఇన్‌లో ఒకటి. Elementor ఉపయోగించి చేసి మనం ఒక page design చేయొచ్చు. మామూలుగా అయితే మనము ఏదైనా ఒక website design చేయాలంటే మనకు చాలా coding knowledge అనేది ఉండాలి. ముఖ్యంగా ఒక మంచి website మనకు తయారు చేయడం తెలియాలంటే మనకు అవసరపడే coding languages ఏంటి అనేది చూద్దాం.

HTML – ఈ HTML నీ ఉపయోగించి మనం వెబ్సైట్లో ఎటువంటి సమాచారం చూపించాలి అనేది మనం ఈ HTML ద్వారా చేయవచ్చు. ముఖ్యంగా మన website లో ఎటువంటి ఉండాలి ఎటువంటి సమాచారం చూపియ్యాలి అనేదాని గురించి మనం చెప్పాలంటే ఒక website రూపంగా మనకు ఈ ఒక్క HTML language అయితే తెలిసి ఉండాలి.

CSS – ఈ CSS నీ ఉపయోగించి మనం website ఎటువంటి కలర్స్ ఉండాలి ఇటువంటి స్టైల్ అంటే ఒక ఆకర్షణీయమైన website రూపొందించాలంటే మీరు ఏదైతే ఇప్పుడు చూసినట్లయితే website ఏదైనా ఉంటే దానికి ఒక color కానీ, animations కానీ, design కానీ ఒక premium look అటువంటి స్టైలింగ్ ఉంటది కదా అటువంటి ఒక మంచి ఆకర్షణీయమైన website తయారీ కోసం మనకు ఈ CSS language అయితే తెలిసి ఉండాలి.

JavaScript – ఈ JavaScript నీ ఉపయోగించి మనం websiteలో ఒక perfect response అయితే తీసుకొని రావచ్చు. Responsive అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే HTML మరియు CSS ద్వారా మనకు ఒక మంచి website అయితే తయారు చేసుకోవచ్చు.

కానీ కేవలం HTML మరియు CSS ద్వారా మన యొక్క website అనేది పూర్తి అవ్వదు. ఈ JavaScript ఏదైతే ఉందో, మనం ఉపయోగించి మన websiteలో ఉన్నా buttons కానీ ఏదైనా links ఉన్నా కానీ వాటికి ఒక functionality ఇస్తావ్ కదా, వివరంగా చెప్పాలంటే మనం websiteలో ఏదైనా ఒక దాన్ని click చేసినప్పుడు దానికి సంబంధించిన post కానీ లేదా దానికి సంబంధించిన pageకీ మనం వెళ్తున్నాం కదా.

ఈ యొక్క functionality మనకు మనం ఎంచుకున్నా link కీ కానీ, postకి కానీ సరిగ్గా వెళ్లడానికి ఈ JavaScript మనం ఉపయోగిస్తాం.

పై చెప్పినవి కాకుండా మనకు ఒక మంచి website design చేయాలంటే coding language లో వేరు వేరు coding language కూడా ఇప్పుడు market available గా ఉన్నాయి. కానీ మనం ఒక website design చేయాలంటే మనకు ముఖ్యంగా కావలసిన languages అయితే నేను పైన చెప్పాను.

చూశారుగా మనకు ఒక complete website design చేయాలంటే మనకు కావాల్సిన languages ఏమిటో. కానీ మీరు ఉన్న technology ని తీసుకున్నట్లయితే ఈ పై ఉన్న language ఏమి మనకు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా. ఈ Elementor అనే plugin మనకు ఉపయోగపడుతుంది.

సులువుగా చెప్పాలంటే Elementor అనేది ఒక plugin, దీని ద్వారా మనం web page design చేయొచ్చు, మనకు ఎటువంటి coding నాలెడ్జ్ అవసరం లేకుండా ఇందులో ఒక widget రూపంలో అయితే మనకు అన్నీ ముందుగానే availability లో ఉంటాయి.

మనం మనకు కావలసిన ఒక area, ఉదాహరణకి నేను ఇప్పుడు దీన్ని పక్కన ఒక button పెట్టాలి అనుకున్నప్పుడు Elementor ఉపయోగించి బటన్ అయితే నేను ఈజీగా place చేయొచ్చు.

ప్రతి ఒక్కరూ Elementor ఉపయోగించవచ్చు, మీరు programmer కానవసరం లేదు మరియు, మీరు developer కానవసరం లేదు, దాని కోసం మీరు WordPress pages లో drag-and-drop చేసి design చేయవచ్చు. కాబట్టి post లో నేను మీకు Elementor ఎలా పొందాలి మీరు ఎలా దీన్ని install చేసి ఎలా ఉపయోగించుకోవచ్చు నేను చెప్తాను.

Elementor అనేది ఏమిటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం Elementor ఎలా పొందాలి, ఎలా మన WordPress Dashboard లో install చేయాలో తెలుసుకుందాం.

Elemnetor ని ఎలా ఇంస్టాల్ చేయాలి?

ముందుగా మీరు Elementor plugin ఇన్స్టాల్ చేయడానికి మీరు Plugins Section కి వెళ్ళాలి, Plugin Section కి వెళ్ళిన తర్వాత పైన మీకు “Add New” అనే button కనిపిస్తుంది. ఆ button పైన click చేయండి, మీకు కుడి వైపున ఒక Search box area అయితే కనిపిస్తుంది, ఆ Search Box లో “Elementor” అని type చేసి Search చెయ్యండి. మీకు Elementor plugin అనేది install చేసుకోమని కనిపిస్తుంది. మీరు Elementor plugin ఇన్స్టాల్ చేసుకుని తర్వాత “Activate” చేసుకోవాలి.

మీకు Elementor install చేయడం ఎలా అనేది ఇబ్బందిగా ఉంటే కింద ఉన్నా step-by-step process ని పాటించండి:

1. ముందుగా మీరు మీ యొక్క WordPress Dashboard లోకి Login అవ్వండి.

2. మీ ఎడమపక్క ఉన్నా Options లో plugin అనే Section మీద click చేయండి.

3. పైన “Add New” అనే బట్టను ఒకటి ఉంటుంది, ఆ button పైన click చేయండి.

4. “Add New” button మీద click చేసినా తర్వాత మీకు కుడివైపున ఒక Search Box ఉంటుంది. అందులో “Elementor” అని type చేసి Search button మీద click చేయండి, లేదా మీ keyboard లో “Enter” Key ని press చేయండి.

5. మీకు Elementor plugin అయితే ముందుగా కనిపిస్తుంది. Elementor plugin పక్కన మీకు “Install” button కనిపిస్తుంది. ఆ install button మీద click చేయండి.

6. Install అయిన తర్వాత మీకు “Activate” అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకసారి మీరు Activate చేసిన తర్వాత Elementor అనేది మీ యొక్క WordPress websiteలో Install అవుతుంది.

ఈ plugin install అయిన తర్వాత మీరు ఏ page లోకి వెళ్ళినా పైన మీకు “Edit with Elementor” (ఎడిట్ విత్ ఎలిమెంట్ ఆర్) అని కనిపిస్తుంది. మీరు ఆ button పైన click చేసిన తర్వాత మీకు ఒక Elementor environment అయితే వస్తుంది. అందులో మీరు మీ page మీకు నచ్చిన విధంగా ఎలా కావాలో ఆ విధంగా అయితే మీరు design చేసుకోవచ్చు.

Elementor ను ఎందుకు ఉపయోగించాలి?

Elementor ఎందుకు వాడాలి అనే దానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే Elementor ని వారైనా వారైనా కానీ మీరు ఈ యొక్క Elementor అనేది అన్ని సులభంగా అయితే ఉపయోగం మీకు coding వచ్చినా రాకపోయినా కానీ ఈ యొక్క Elementor అనేది మీ యొక్క team వర్క్ అయ్యుంటే, లేదా ఒక బిజినెస్ అనేది ఒక గ్రూపుల చేసినప్పుడు lock కాకుండా అందరికీ మీరు ఏం చేస్తున్నారో తెలియాలంటే Elementor అనేది సులభంగా ఉపయోగపడుతుంది.

కాబట్టి మీకు coding వచ్చినా రాకపోయినా Elementor లో మీరు అన్నీ easy గా drag చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇందులో 90 కి పైగా widgets ఉన్నాయి, మీకు కావాల్సిన widget లను మీరు సులభంగా డ్రాగ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.

Elementor అనేది మీరు ఉచితంగా వాడాలని అనుకుంటే మీకు కొన్ని widgets మాత్రమే అందుబాటులో ఉంటాయి, మీరు ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మీరూ వాళ్ళ యొక్క ప్రీమియం widgets కూడా సులభంగా వాడుకోవచ్చు.

ఇంతకు ముందు చెప్పినట్లు Elementor అనేది మీరు పేజీ బిల్డింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు, ముఖ్యంగా మీరు Landing Page (అంటే Home Page) ఏదైతే ఉందో దాన్ని చాలా Attractive గ మీరు తయారు చేసుకోవచ్చు.

Conclusion

మీకు అవసరమైన సమాచారాన్ని నేను అందించానని అనుకుంటున్నాను, మీకు ఇంకా Elementor గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉంటే కింద ఉన్న Comments Section లో మీయొక్క ప్రశ్న మాకు తెలపండి. మేము వీలైనంత తొందరగా మీయొక్క ప్రశ్నకి సమాధానం అందించడానికి ప్రయత్నిస్తాం.

అలాగే మీకు సమాచారం నచ్చినట్లయితే మీ తోటివారికి Share చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి సమాచారాన్ని మన తెలుగు భాషలో తెలుసుకునే దానికి website ని follow అవుతూ ఉండండి. మళ్లీ ఇంకో మంచి సమాచారంతో కలుసుకుందాం.

Scroll to Top