ఈ రోజు ఆర్టికల్ లో మనం web push notifications అంటే ఏమిటో తెలుసుకుందాము.
మనం ఏదయినా product లేదా సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత దానిని మనం proper గా మార్కెటింగ్ లేదా ప్రచారం చేయాలి అనుకుంటాం, అలా చేస్తేనే మనకి కస్టమర్ లు వస్తారు.
అయితే ఈ రోజులలో ప్రతి ఒక్కరు తమ సమయాన్ని ఆన్లైన్ లో గడుపుతున్నారు. వారికి max ఏమి కావాలి అన్నా గూగుల్ లేదా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు.
కావున మనం మన బిజినెస్ ని డిజిటల్ వైపు నడిపించాలి.
మనం మన బిజినెస్ ని డిజిటల్ లో పెట్టడానికి మనం ముందుగా చేయాలసింది వెబ్సైటు.
అవును మన బిజినెస్ ని proper గా ప్రమోట్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక వెబ్సైటు స్టార్ట్ చేయవలెను.
మనం వెబ్సైటు స్టార్ట్ చేస్తే సరిపోదు దానిని యూజర్లు విజిట్ చేయాలి అప్పుడు మాత్రమే మనకి బిజినెస్ generate అవుతుంది.
మన వెబ్సైటు కి వచ్చిన యూజర్ని మల్లి మల్లి వచ్చేలా చేయడానికి మనం Web Push Notifications వాడుతాము.
వర్డుప్రెస్సు వెబ్సైటు కి Web Push Notifications కోసం మనకి మార్కెట్ లో వివిధ ప్లగిన్ లు ఉన్నాయి.
అందులో ఒక పాపులర్ ప్లగిన్ ఏంటి అంటే Onesignal.
మనం మన WordPress వెబ్సైటు లో Onesignal ప్లగిన్ ఇన్స్టాల్ చేయవలెను.
మనం ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ప్లగిన్ మన వెబ్సైటు కి వచ్చే యూజర్లను capture చేసుకుంటుంది.
ఇక్కడ యూజర్ వెబ్సైటు విసిట్ చేసిన తర్వాత వారికి ఒక నోటిఫికేషన్ display అవుతుంది యూజర్ దానిని allow చేయగానే వారు లిస్ట్ కి యాడ్ అవుతారు, ఒకవేళ వారు don’t allow క్లిక్ చేస్తే ఇవి మనకి లిస్ట్ కి యాడ్ అవవు.
మనం ఎప్పుడయినా updates ఈ లిస్ట్ కి పంపవచ్చు.
ఇలా పంపిన వెంటనే ఆ యూజర్ కి నోటిఫికేషన్ లా వెళుతుంది.
మనం ఒకవేళ లేటెస్ట్ పోస్ట్ షేర్ చేయాలి అంటే మనం ఆ పర్టికులర్ లింక్ ని ఈ లిస్ట్ కి షేర్ చేయవలెను.
మనకి onesignal ఆటోమేటిక్ ఫీచర్ ఇస్తుంది. మనం న్యూ పోస్ట్ పబ్లిష్ చేసినా లేదా అప్డేట్ చేసినా నోటిఫికేషన్ ఆటోమేటిక్ గా వెళ్లే ఫెసిలిటీ ని onesignal ప్రొవైడ్ చేస్తుంది.
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.