ఈ రోజు పోస్ట్ లో Facebook ద్వారా inbound leads or organic లీడ్స్ ఎలా generate చేయవచ్చొ 5 టిప్స్ నా Facebook Experience నుండి నేను మీకు ఇస్తాను.
ముందుగా మనం మన ఫేస్బుక్ ప్రొఫైల్ ని ఆప్టిమైజ్ చేసుకొనవలెను.
మనం ఏ సర్వీస్ ఇస్తున్నామో లేదా ఏ ట్రైనింగ్ ఇస్తున్నామో people మన ప్రొఫైల్ విజిట్ చేసిన వెంటనే వాళ్లకి క్లియర్ గా అర్ధం అయితే వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు.
దీనికి మనం ముందుగా ప్రొఫైల్ ఫోటో మన ఫోటో నే పెట్టుకోవలెను. అప్పుడే people మనల్ని ట్రస్ట్ చేస్తారు.
తర్వాత కవర్ ఫోటో ఒకటి Canva లేదా Photoshop ద్వారా క్రియేట్ చేసుకోవలెను.
ఈ కవర్ ఫోటో లో మనం ఎవరికి ఏ సర్వీస్ ఇస్తున్నామో క్లియర్ గా మెసేజ్ convey చేయవలెను.
కవర్ ఫోటో లో CTA add చేయవలెను.
కవర్ description లో మనం యూసర్ ని మన Facebook గ్రూప్ కి వెళ్లేలా convey చేయవలెను.
బయో లో కూడా మనం ఎవరికి ఏం సర్వీస్ ఇస్తామో క్లియర్ గా పెట్టవలెను. CTA కూడా include చేయవలెను.
Next మనం మన ప్రొఫైల్ లో ట్రస్ట్ పెరిగేలా ఒక పోస్ట్ క్రియేట్ చేసి దానిని టాప్ లో పిన్ చేయవలెను. ఇక్కడ మీరు testimonial పోస్ట్ పెడితే చాలా బెటర్. లేదంటే మీ ఫేస్బుక్ గ్రూప్ కి invite చేయండి.
మీరు మీకు ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేసుకొనవలెను.
ఫేస్బుక్ గ్రూప్ ని కూడా ఫుల్ సెటప్ చేసుకొనవలెను.
ఇందులో మనకి గ్రేట్ ఫీచర్ ఏంటి అంటే membership questions.
వీటి ద్వారా మనం క్వాలిటీ people ని మన గ్రూప్ లోకి తెచ్చుకోవచ్చు.
ఇక్కడ మనం మూడు ప్రశ్నలు సెట్ చేయవచ్చు. అందులో ఒకటి లీడ్ జనరేషన్ కి వాడవచ్ఛు.
మనం రెగ్యులర్ గా మన ప్రొఫైల్ లో helpful content పెట్టవలెను.
ప్రతి పోస్ట్ చివరలో CTA ఇవ్వవలెను.
ఇక్కడ మీరు CTA అనునది కామెంట్ వచ్చేలా ఉంటే బెటర్. మనకి ఎక్కువ కామెంట్ లు వస్తే ఎక్కువ రీచ్ వస్తుంది.
మనం రెగ్యులర్ గా ఇతరులతో కనెక్ట్ అవ్వవలెను.
మనం రెగ్యులర్ గా ఇతరుల కంటెంట్ తో ఎంగేజ్ అవ్వవలెను.
మనం relevant Facebook గ్రూప్ లు లోకి జాయిన్ అయ్యి అక్కడ value ఇవ్వవలెను.
ఈ విధంగా మీరు రెగ్యులర్ గా చేస్తే మీకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్ and Facebook Group ద్వారా క్వాలిటీ లీడ్స్ వస్తాయి.
మీకు ఈ పోస్ట్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.