ఈ రోజు ఆర్టికల్ లో 5 ముఖ్యమయిన .డిజిటల్ మార్కెటింగ్ విషయాలు గురించి డిస్కస్ చేసుకుందం.
ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. చాలా యువత సోషల్ మీడియా వాడుతున్నారు.
దీని వల్ల మన బిజినెస్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి. జనం ఎక్కువ ఏక్కడ ఉంటే అక్కడ మన ప్రాడక్ట్ గురించి వివరించాలి. అప్పుడే మనకు సేల్స్ పెరుగుతాయి.
దీని కోసం మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ ఉండే వివిధ విషయాలు గురించి తెలుసుకోవాలి.
ఈ రోజు మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే కొన్ని ముఖ్యమయిన విషయాలు గురించి చెప్పుకుందాం.
Search Engine Optimization
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ డిజిటల్ మార్కెటింగ్ లో చాల ముఖ్యమయిన టాపిక్. మనకి సెర్చ్ ఇంజిన్ లు నుంచి ఫ్రీగా ట్రాఫిక్ రావాలి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ చాల ఉపయోగపడుతుంది.
మన వెబ్సైటు లేదా బ్లాగ్ ని సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ లో టాప్ లోకి తీసుకురావడాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ అంటారు.
ఒకసారి మన వెబ్సైటు లేదా బ్లాగ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ అవ్వుతే మనకి సెర్చ్ ఇంజిన్ లు నుండి ఎక్కువ ట్రాఫిక్ ఫ్రీగా వస్తుంది.
దీని కోసం మన వెబ్సైటు కి Onpage SEO మరియు Offpage SEO చెయ్యాలి.
Search Engine Marketing
మనం సెర్చ్ ఇంజిన్ కి కొంత అమౌంట్ పే చేసి మన వెబ్సైటు లేదా బ్లాగ్ ని సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ లో టాప్ లోకి తెచ్చుకోవడాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు.
ఒకసారి మన వెబ్సైటు కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ చెయ్యడం ద్వారా మనకి సెర్చ్ ఇంజిన్ లు నుండి ఫ్రీగా ట్రాఫిక్ వస్తుంది.
కానీ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో మనం సెర్చ్ ఇంజిన్ కి అమౌంట్ పే చేసి మన వెబ్సైటు ని టాప్ లోకి తెచ్చుకుంటాం.
ఇందులో మనం ఎన్ని రోజులు అయితే సెర్చ్ ఇంజిన్ ని అమౌంట్ పే చేస్తామో అన్ని రోజులు మన వెబ్సైటు టాప్ లో వస్తుంది.
ఒకసారి అమౌంట్ పే చెయ్యడం ఆపేస్తే మన వెబ్సైటు ను చూపించడం కూడా ఆగిపోతుంది.
Social Media Marketing
మన బిజినెస్ లేదా ప్రొడక్ట్స్ ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకోవడాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు.
ఇందులో మనం పేస్ బుక్ ద్వారా మార్కెటింగ్ చేస్తే పేస్ బుక్ మార్కెటింగ్ అని ఇంస్టాగ్రామ్ ద్వారా చేస్తే ఇంస్టాగ్రామ్ మార్కెటింగ్ అని అంటారు.
దీనికి మనం ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫారం లో మన ఒక ప్రొఫైల్ లేదా పేజీ క్రియేట్ చేసుకోవాలి. దానికి ఆడియన్స్ పెంచుకోవాలి.
తర్వాత మన ఆడియన్స్ కి మంచి వేల్యూ ఇస్తూ మన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవచ్ఛు.
ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి అంటే యాడ్స్ రన్ చెయ్యాలి.
సోషల్ మీడియా మార్కెటింగ్ లో మనం మార్కెటింగ్ ఫ్రీ గా మరియు పెయిడ్ గా కూడా చేసుకోవచ్చు.
ఫ్రీగా చేసుకొనుటకు మన పేజీ ఆడియన్స్ కి మన ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తాం. అదే పెయిడ్ పద్దతి అయితే యాడ్స్ రన్ చెయ్యడం.
మనం పేస్ బుక్ వాడేటప్పుడు మనం వివిధ యాడ్స్ మన ఫీడ్ లో చూస్తూ ఉంటాం. ఇవి ఫేస్ బుక్ యాడ్స్ ద్వారా క్రియేట్ చేసినవి.
Email Marketing
మనం ఆడియన్స్ నుండి ఇమెయిల్ లు సేకరించి మన ప్రొడక్ట్స్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడాన్ని ఇమెయిల్ మార్కెటింగ్ అంటారు.
ఇందులో మనం ముందు మన బ్లాగ్ కి వచ్ఛే విజిటర్స్ నుండి ఇమెయిల్ కలెక్ట్ చేస్తాం. లేదా యాడ్స్ ద్వారా ఇమెయిల్ సేకరిస్తాం.
ఒకసారి మనం ఇమెయిల్ లు సేకరించిన తరువాత వాళ్లకి మంచి వాల్యూ ఇస్తూ మన ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ని ప్రమోట్ చేసుకోవచ్ఛు.
ఇమెయిల్ మార్కెటింగ్ కి మనం Mailchimp వాడొచ్చు. దీనిని 2000 ఇమెయిల్ కాంటాక్ట్ లు వరకు ఫ్రీగా ఇమెయిల్ మార్కెటింగ్ చేసుకోవచ్ఛు.
Data Analytics
మన బ్లాగ్ కి వచ్ఛే విజిటర్స్ ని స్టడీ చేయుటకు డేటా అనలిటిక్స్ ఉపయోగపడుతుంది.
దీనికి గూగుల్ అనలిటిక్స్ చాల పాపులర్. గూగుల్ అనలిటిక్స్ మన ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఇచ్ఛే కోడ్ ని మన బ్లాగ్ లేదా వెబ్సైటు లో ఇంస్టాల్ చెయ్యాలి.
దీని ద్వారా మన వెబ్సైటు కి ఎక్కడి నుండి విజిటర్స్ వస్తున్నారు అన్నది తెల్సుకోవచ్ఛు.
మీకు ఈ ఆర్టికల్ సహాయ పడుతాదని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే mail me.
ధన్య వాదములు.