10 Essential Plugins for Your WordPress Online Store Telugu

ఈ రోజు ఆర్టికల్ లో మనం WordPress ద్వారా ఒక online store స్టార్ట్ చేయడానికి కావలసిన plugins కోసం డిస్కస్ చేసుకుందాం. 

Ecommerce వెబ్సైటు స్టార్ట్ చేయడానికి వర్డుప్రెస్సు అనునది ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేయడానికి WordPress నే ఉపయోగిస్తున్నారు. 

వర్డుప్రెస్సు లో ఒకో ఫంక్షన్ కి ఒకో ప్లగిన్ ఉంది , ఇదే వర్డుప్రెస్సు తో అడ్వాంటేజ్. 

మీరు కూడా వర్డుప్రెస్సు తో ఒక ecommerce వెబ్సైటు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు ఈ ప్లగిన్ లు ఎంతో ఉపయోగపడతాయి. 

10 Essential Plugins for Your WordPress Online Store Telugu

ఇక ఏ ఆలస్యం లేకుండా లిస్ట్ లోకి వెళదాము. 

WooCommerce

ఇది చాలా పాపులర్ WordPress eCommerce ప్లగిన్. 

ఈ ప్లగిన్ ద్వారా మనం మన వెబ్సైటు కి eCommerce functionality తీసుకురావచ్చు. 

ఈ ప్లగిన్ తో ప్రోడక్ట్ management , inventory management, payment gateway మొదలగు ecommerce వాటిని మేనేజ్ చేయవచ్చు. 

RankMath SEO 

ఇది ఒక WordPress SEO ప్లగిన్. SEO కి ఇది చాలా పాపులర్ ప్లగిన్. 

ఈ ప్లగిన్ ద్వారా మనం మన స్టోర్ లో ఉండే ప్రోడక్ట్ పేజీలు, బ్లాగ్ పోస్ట్ పేజీలు సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ గా ఆప్టిమైజ్ చేయవచ్చు. 

ఈ ప్లగిన్ ద్వారా మనం మన స్టోర్ sitemap generate చేయవచ్చు. 

ఈ ప్లగిన్ మన స్టోర్ కి ఆర్గానిక్ ట్రాఫిక్ తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. 

WPForms 

ఈ ప్లగిన్ ద్వారా మనం forms క్రియేట్ చేయవచ్చు. 

మనం మన స్టోర్ కాంటాక్ట్ పేజీలో కాంటాక్ట్ form క్రియేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. 

ఈ ప్లగిన్ ద్వారా మనం ఆర్డర్ forms కూడా క్రియేట్ చేయవచ్చు. ఈ ప్లగిన్ తో యూజర్ కి మంచి షాపింగ్ experience ఇవ్వవచ్చు. 

Litespeed Cache 

ఇది ఒక WordPress Cache ప్లగిన్. 

ఈ ప్లగిన్ మన స్టోర్ ఫాస్ట్ గా ఓపెన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. 

దీనితో మనం css , js లను minify చేయవచ్చు. 

ఇది సర్వర్ లోడ్ తగ్గించడం వల్ల యూజర్ కి మనం మంచి experience ఇవ్వవచ్చు. 

Akismet Anti-Spam

ఇది ఒక WordPress anti spam ప్లగిన్. 

దీని ద్వారా మనం మన స్టోర్ లో spam comments ను reduce చేయవచ్చు. 

UpdraftPlus

ఇది ఒక WordPress backup and restore ప్లగిన్. 

దీని ద్వారా మనం మన స్టోర్ వెబ్సైటు ను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు backup తీసుకోవచ్చు. ఎప్పడు కావాలి అంటే అప్పుడు రిస్టోర్ చేయవచ్చు. 

ఈ backup process ని మనం ఈ ప్లగిన్ ద్వారా ఆటోమేట్ చేయవచ్చు. 

ఈ ప్లగిన్ ద్వారా మన వెబ్సైటు backup, Google Drive కి ఆటోమేటిక్ గా అప్లోడ్ అయ్యేలా సెట్ చేయవచ్చు. 

ప్రతి వెబ్సైటు పర్సన్ ఈ ప్లగిన్ యూజ్ చేయాలి. 

WPCode 

ఈ ప్లగిన్ మనం మన స్టోర్ లో custom కోడ్ లు పెట్టడానికి ఉపయోగపడుతుంది. 

మనం హెడర్ లేదా footer లో ఏదయినా కోడ్ పెట్టాలి అంటే అప్పుడు కూడా ఈ ప్లగిన్ మనకి ఉపయోగపడుతుంది. 

మనం గూగుల్ ఆనాలిటిక్స్ కోడ్ హెడర్ లో ప్లేస్ చేయడానికి ఈ ప్లగిన్ ఉపయోగపడుతుంది. 

Click to Chat by Holithemes 

ఈ ప్లగిన్ మనం మన స్టోర్ వెబ్సైటు లో వాట్సాప్ విడ్జెట్ add చేయడానికి ఉపయోగపడుతుంది. 

దీనిని మనం మన స్టోర్ లో ఇన్స్టాల్ చేయడం ద్వారా యూజర్ సింగల్ క్లిక్ లో మన వాట్సాప్ కి మెసేజ్ పెట్టవచ్చు. 

Elementor 

ఈ ప్లగిన్ మన స్టోర్ పేజీలు డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. 

దీనితో మనం హెడర్ అలాగే footer కూడా కావలసిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. 

OneSignal Push Notifications

ఇది ఒక పాపులర్ వర్డుప్రెస్సు push notifications ప్లగిన్. 

ఈ ప్లగిన్ మన స్టోర్ లో install చేయడం ద్వారా మనం మన స్టోర్ యొక్క repeated ట్రాఫిక్ ను పెంచుకోవచ్చు. 

Also Read: What are web push notifications

Conclusion 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాది అని అనుకుంటున్నాను. 

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. 

ధన్యవాదములు. 

Scroll to Top