ఈ రోజు ఆర్టికల్ లో మనం ఇండియా లో 3 బెస్ట్ పేమెంట్ gateways ఏమిటో తెలుసుకోవచ్చు.
మనం ఆన్లైన్ లో పేమెంట్ ఆటోమేటిక్ గా మన కస్టమర్స్ నుండి collect చేయాలి అంటే మనం ఖచ్చితంగా పేమెంట్ gateway వాడవలెను.
ఎవరైతే ecommerce వెబ్సైటు స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్లకి పేమెంట్ gateway కోసం ఖచ్చితంగా అవగాహన ఉండవలెను.
మీరు మీ ecommerce స్టోర్ లో పేమెంట్ కలెక్ట్ చేయాలి అంటే మీరు ఈ పేమెంట్ gateway ను ఉపయోగించవలెను.
మీకు ఒక డౌట్ రావొచ్చు , UPI id లేదా qr code షేర్ చేస్తే అవతలి వారు పేమెంట్ ఈజీగా చేయొచ్చు కదా అని.
ఇది manual process.
పేమెంట్ gateway అనునది ఆటోమేటిక్ పేమెంట్ collecting సిస్టం.
ఇందులో మనం ఒక పేమెంట్ లింక్ క్రియేట్ చేస్తాం. ఈ లింక్ ను ఎవరు అయితే పేమెంట్ పంపాలో వారికి ఫార్వర్డ్ చేస్తాం.
అలాగే మన వెబ్సైటు ద్వారా పేమెంట్ కల్లెక్ట్ చేయాలి అంటే అప్పుడు మనం Woocommerce supported ప్లగిన్ ద్వారా వర్డుప్రెస్సు వెబ్సైటు లో చేస్తాం.
ఏ పేమెంట్ gateway కి ఆ particular Woocommerce ప్లగిన్ ఉంటుంది.
5 Best Payment Gateways in India Telugu
ఎటువంటి ఆలస్యం చేయకుండా లిస్ట్ లోకి వెళదాము.
Razorpay
ఇది ఇండియా లో వన్ పాపులర్ పేమెంట్ gateway.
మనం వివిధ పేమెంట్ options లో పేమెంట్ లు accpet చేయవచ్చు, like UPI , net banking , credit cards , debit cards etc.
ఇండియా లో వివిధ బ్రాండ్స్ ఈ పేమెంట్ gateway ను ఉపయోగిస్తున్నాయి.
మనం ముందుగా మన మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ id తో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవలెను.
తర్వాతా kyc వెరిఫికేషన్ చేయవలెను.
మన బిజినెస్ related డాక్యుమెంట్ లు అప్లోడ్ చేయవలెను.
ఒకసారి వారి టీం manual వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇస్తారు.
ఇందులో మనం బిజినెస్ రిజిస్టర్ చేయకపోయినా కొంత అమౌంట్ వరకు payments కలెక్ట్ చేయవచ్చు.
ఇందులో మనం పేమెంట్ లింక్ లు క్రియేట్ చేయవచ్చు.
అలాగే మన వెబ్సైటు లో woocommerce razorpay ప్లగిన్ సెటప్ చేయడం ద్వారా మనం వెబ్సైటు పేమెంట్ లు collect చేయవచ్చు.
Instamojo
ఇది కూడా ఇండియా లో ఒక పాపులర్ payment gateway.
మన మొబైల్ నెంబర్ , ఇమెయిల్ తో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవలెను.
తర్వాత relevant documents upload చేసి kyc వెరిఫికేషన్ చేసుకోవలెను.
Instamojo టీం మన డాక్యుమెంట్ లను observe చేసి ఓకే అయితే అప్రూవల్ ఇస్తారు.
ఇందులో కూడా బిజినెస్ రిజిస్టర్ చేయకపోయినా కొంత అమౌంట్ వరకు పేమెంట్ లు కలెక్ట్ చేయవచ్చు.
Paytm PG
ఇది కూడా ఇండియా లో పాపులర్ పేమెంట్ gateway.
ఇందులో మనకి పర్సనల్ మరియు బిజినెస్ అకౌంట్ అని రెండు రకాలు ఉంటాయి.
మనం మన మొబైల్ నెంబర్ తో బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేయవలెను.
తర్వాత kyc verification చేసుకోవలెను.
ఇందులో కూడా బిజినెస్ రిజిస్టర్ చేయకపోయినా కొంత అమౌంట్ వరకు payments కలెక్ట్ చేయవచ్చు.
Conclusion
మీరు ముందుగా Razorpay payment gateway కి sign up అవ్వండి.
ఇది ఇండియా లో చాల పాపులర్ payment gateway. ప్రాసెస్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది.
మీరు alternative కోసం చుస్తే అప్పుడు మీరు Instamojo లేదా Paytm ట్రై చేయవచ్చు.
మీరు ఈ పేమెంట్ gateway ను మీ వెబ్సైటు లో integrate చేయడానికి ఏదయినా టెక్నికల్ హెల్ప్ కావాలి అంటే ఇప్పుడే మాకు మెసేజ్ చేయండి
Thank you.