హలో అండి. ఈ రోజు ఆర్టికల్ లో మనం కొన్ని ఫ్రీ SEO టూల్స్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
SEO అనేది చాలా ముఖ్యం. మన వెబ్సైట్ కి ట్రాఫిక్ తీసుకురావడంలో SEO ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తే సరిపోదు. దానికి ట్రాఫిక్ తీసుకురావలెను. అప్పుడే మన వెబ్సైట్ ద్వారా మన బిజినెస్ కి లీడ్స్ వస్తాయి.
మన వెబ్సైట్ ని సెర్చ్ ఇంజిన్ నుండి ట్రాఫిక్ వచ్చేలా optimize చెయ్యడాన్ని Search Engine Optimization అంటారు.
అయితే మనం మన వెబ్సైట్ కి proper గా SEO చేయుటకు మనకు వివిధ టూల్స్ అవసరం. ఈ రోజు ఆర్టికల్ లో మనం కొన్ని ఫ్రీ SEO టూల్స్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
Google Pagespeed Insights Tool
ఈ టూల్ ద్వారా మన వెబ్సైట్ స్పీడ్ తెలుసుకోవచ్చు. మనం ఎప్పటికప్పుడు మన వెబ్సైట్ హోమ్ పేజీ అలాగే వెబ్సైట్ లో వివిధ పేజీల స్పీడ్ ట్రాక్ చేసుకోవలెను.
మన వెబ్సైట్ ఫాస్ట్ గా లోడ్ అవ్వకపోతే యూజర్లు వెంటనే బ్యాక్ బటన్ క్లిక్ చేసి మన వెబ్సైట్ నుండి బయటకు వెళ్ళిపోతారు.
ఎప్పుడైతే యూజర్లు ఇలా చేస్తారో అప్పుడు మన సెర్చ్ ర్యాంకింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కావున పేజీ లోడింగ్ స్పీడ్ చాలా ముఖ్యం.
మనం ఈ టూల్ ద్వారా ఎప్పటికప్పుడు పేజీ స్పీడ్ తెలుసుకోవచ్చు.
Google Keyword Planner
ఈ టూల్ ద్వారా మనం కీవర్డ్ రీసెర్చ్ చేయవచ్చు.
మనం సెర్చ్ ఇంజిన్ నుండి ట్రాఫిక్ తెచుకొనుటకు మనం మన వెబ్సైట్ ఆర్టికల్ లు వ్రాయవలెను. ఇది కీవర్డ్ రీసెర్చ్ తో స్టార్ట్ అవుతుంది.
మనం ఆర్టికల్ లు ఏ కీవర్డ్ ని టార్గెట్ చేసి వ్రాయాలో దీని ద్వారా తెలుస్తుంది.
Answer the Public
లాంగ్ టైల్ కీవర్డ్ లు తెలుసుకొనుటకు అలాగే వివిధ యూజర్లు వెతికే ప్రశ్నలు ఏమిటో తెలుసుకొనుటకు ఈ టూల్ ఉపయోగపడుతుంది.
Google Analytics
మీ వెబ్సైట్ కి వచ్చే ట్రాఫిక్ ను ట్రాక్ చేసుకొనుటకు ఈ టూల్ ఉపయోగపడుతుంది.
ఈ టూల్ వారు మీకు javascript కోడ్ ఇస్తారు. దానిని మీరు మీ వెబ్సైట్ హెడర్ లో పెట్టవలెను.
ఈ కోడ్ మీ వెబ్సైట్ కి వచ్చే ట్రాఫిక్ ని కౌంట్ చేస్తుంది.
Google Search Console
మీరు మీ వెబ్సైట్ ను గూగుల్ కి submit cheyutaku ఈ టూల్ ఉపయోగపడుతుంది.
backlinks SEO లో కీలక పాత్ర.
మన వెబ్సైట్ backlinks ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడం వాళ్ళ మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
ఈ టూల్ ద్వారా competitor రీసెర్చ్ చేయవచ్చు.
Ahrefs Backlinks Checker
ఈ టూల్ ద్వారా మీ వెబ్సైట్ కి ఉన్న backlinks ఏమిటో తెలుసుకోవచ్ఛు.
SEMRush
ఈ టూల్ ద్వారా లిమిటెడ్ ఫీచర్స్ తో కీవర్డ్ రీసెర్చ్ , competitor రీసెర్చ్ ఫ్రీగా చేయవచ్చు.
Google Trends
ఈ టూల్ ద్వారా ఏ keywords లేదా niche users search చేస్తున్నారో తెలుసుకోవచ్ఛు.
రెండు లేదా ఎక్కువ కీవర్డ్ ట్రెండ్ చెక్ చేసి compare చేయవచ్చు.
Rankmath SEO
ఇది ఒక WordPress ప్లగిన్.
మనం ఆర్టికల్ వ్రాసేటప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ గా వ్రాయుటకు ఈ టూల్ మనల్ని గైడ్ చేస్తుంది.