ప్రతి ఒక్కరికి డిజిటల్ మీడియా ద్వారా బిజినెస్ కావాలి కానీ కొంత మంది మాత్రమే ఆ డిజిటల్ మీడియా లో Invest చేస్తారు.
ఇక్కడ చాలా మందికి డిజిటల్ మీడియా ద్వారా attention ఫ్రీగా అలాగే వేగంగా కావాలి.
అది ఎలా కుదురుద్ది.
For every action there is equal reaction అని మనం చిన్నప్పుడే తెలుసుకున్నాము. అంతే ఏదయినా సరే అలాగే పని చేస్తుంది.
మనం ఎంత input effort పెడితే అది అంత పెద్ద Impact క్రియేట్ చేస్తుంది. ఆ Investment అనేది మనీ అవొచ్చు లేదా టైం అవొచ్చు.
మీ దగ్గర మనీ ఉంటె Ads మీద Invest చేయండి. Content Outsourcing మీద పని చేయండి. Influencer మార్కెటింగ్ మీద పెట్టండి.
అదే మీ దగ్గర మనీ లేకుండా టైం మాత్రమే ఉంటే మీరే కెమెరా ముందుకి వచ్చి కంటెంట్ క్రియేట్ చేయండి.
ఎవరినో పెట్టి ప్రమోట్ చేయించుకోవడం కన్నా మీరే స్క్రీన్ మీదకి వచ్చి మీ ఆడియన్స్ ని Educate చేస్తే ఆ Impact వేరే లెవెల్ లో ఉంటాది.
ఉదాహరణకు మన Lalithaa Jewellery Owner గారు ఆయనే తన బ్రాండ్ కి Brand Front Image అవ్వడం వల్ల ఎంత impact క్రియేట్ చేసిందో నేను మీకు వేరే చెప్పనవసరం లేదు.
కావున ప్రతి ఒక్కరు కంటెంట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది.
మీరే స్వయంగా కెమెరా ముందుకి వచ్చి కంటెంట్ చేస్తే చాలా బెటర్ అని నా గట్టి అభిప్రాయం.
చూడండి మీ గురించి లేదా మీ బ్రాండ్ గురించి Audience పదే పదే విన్నా లేదా చూసినా మీ బ్రాండ్ అనేది చాలా బలంగా జన సంద్రంలో ఉంటుంది.
మీకు ఏమయినా సందేహాలు ఉంటె కింద కామెంట్ చేయండి.
ధన్యవాదములు.
మీ Venkat Randa.