What is Affiliate Marketing Telugu

హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు ఆర్టికల్ లో మనం Affiliate మార్కెటింగ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.

మనం వేరే వాళ్ళ product లేదా సర్విస్ ని మన ఆడియన్స్ కి రికమెండ్ చేయడం ద్వారా కమిషన్ పొందడాన్ని Affiliate మార్కెటింగ్ అంటారు.

ఇక్కడ కొన్ని కంపెనీ లు లీడ్ మన ద్వారా వాళ్ళకు రావడం వల్ల పే చేస్తారు. కొన్ని కంపెనీ లు sale అవుతేనే కమిషన్ పే చేస్తారు. ఇవన్నీ మనం ఆ కంపెనీ affiliate మార్కెటింగ్ కి signup అయ్యేటప్పుడు వాళ్ళ terms లో ప్రొవైడ్ చేస్తారు.

ఇక్కడ మనం product క్రియేట్ చేయము. అదే విధంగా ఆ ప్రాడక్ట్ ని కూడా మనం manage చేయము. ఫిజికల్ product అయితే షిప్పింగ్ కూడా హ్యాండిల్ చేయము. ఇవన్నీ మనం ఏ కంపెనీ product అయితే రికమెండ్ చేస్తామో ఆ కంపెనియే చూసుకుంటుంది. మనం మన ఆడియన్స్ కి రికమెండ్ చేస్తాము. మన ఆడియన్స్ ఆ ప్రాడక్ట్ ని మన ద్వారా లేదా మన లింకు ద్వారా కొంటె మనకి కమిషన్ వస్తాది.

ఇక్కడ మెయిన్ గా కమిషన్ రెండు రకాలు. Fixed కమిషన్ and Percentage కమిషన్.

ఫిక్సెడ్ కమిషన్ పద్దతిలో మనం generate చేసిన lead లేదా sale కి fixed గా ఇంత అని అమౌంట్ పే చేస్తారు.

ఈ పద్దతిలో యూజర్ ఆ కంపెనీ కి ఎంత పే చేసిన అంటే తక్కువ చేసిన లేదా ఎంత ఎక్కువ చేసిన సరే కమిషన్ మాత్రము fixed గా ఒక వాల్యూ ఉంటుంది.

next percentage కమిషన్. ఇందులో కస్టమర్ పే చేసిన అమౌంట్ లో కొంత పర్సెంటేజ్ అమౌంట్ మనకి పే చేస్తారు. కస్టమర్ ఎంత ఎక్కువ పే చేస్తే మనకి అంత ఎక్కువ కమిషన్ వస్తుంది.

మన ఇండియా లో పాపులర్ affiliate మార్కెటింగ్ Amazon India.

Amazon India మన అందరికీ తెలిసిందే. మనం ఆన్లైన్ లో షాపింగ్ చేయుటకు ఎక్కువగా ఈ platform యూస్ చేస్తాము.

Amazon India , తమ affiliates కి 1% to 10% వరకు కమిషన్ పే చేస్తుంది. Amazon India లో ఒకో కేటగిరి products కి ఒకో కమిషన్ రేట్ ఉంటుంది.

Amazon ఇండియా affiliate మార్కెటింగ్ లో ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే, మనం ఒక ప్రాడక్ట్ రికమెండ్ చేసిన తర్వాత యూజర్ ఆ లింకు ద్వారా ఏ ప్రాడక్ట్ కొన్న మనకు కమిషన్ వస్తుంది.

ఇక్కడ చాలా మంది కి ఉండే అపోహ ఏమిటి అంటే promote చేసిన product కొంటేనే కమిషన్ వస్తుంది అనుకుంటారు. ఆ లింకు ద్వారా వెళ్ళి వేరే ప్రాడక్ట్ కొంటె కమిషన్ రాదు అనుకుంటారు.

ఆ లింకు ద్వారా వెళ్ళి ఏ eligible product కొన్న సరే కమిషన్ వస్తుంది.

Affiliate మార్కెటింగ్ గురించి మరెన్నో వివరాలు వచ్చే upcoming ఆర్టికల్ లలో తెలుసుకోవచ్చు.

ధన్యవాదములు.

Scroll to Top